2023 లో ప్రభాస్ కు ఆ ఇబ్బందులు తప్పవు.. అతను నమ్మడు, కానీ ఇది నిజం : వేణు స్వామి

కొంతమంది వల్ల ఇంకొంత మంది ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా కాలం కాబట్టి.. ఇది కచ్చితంగా జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఉదాహరణగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి చెప్పుకోవచ్చు. బాబు గోగినేని అనే నాస్తికుడు కమ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఇతన్ని ఫ్రాడ్ అన్నాడు, కానీ బాబు గోగినేని విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజం అవ్వడం వల్ల వేణు స్వామి బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిపోయాడు.

సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు, రాంచరణ్ – ఉపాసన లు లేట్ గా తల్లిదండ్రులు అవుతారు అని ఇతను చెప్పాడు. అవి నిజమయ్యాయి. కాబట్టి ఇతను చెప్పాడు అంటే ఇది అక్షర సత్యం అని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇతను ప్రభాస్ జాతకం చెప్పాడు. 2023 లో ప్రభాస్ జాతకం చాలా వరస్ట్ గా ఉందని చెప్పి షాకిచ్చాడు. వేణు స్వామి మాట్లాడుతూ.. “ప్రభాస్ జీవితంలో చాలా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. సినిమాల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు.

ప్రభాస్ జాతకాలను నమ్మడు. అందుకే అతను జాతకాల పై తీసిన సినిమా(రాధే శ్యామ్) కూడా ప్లాప్ అయ్యింది. ప్రభాస్ రాజుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆ కమ్యూనిటీ వారు అందరూ జాతకాలు నమ్ముతారు గౌరవిస్తారు. కానీ ప్రభాస్ గౌరవించడు. ప్రభాస్ ది వృశ్చిక రాశి. ఆయన జాతకంలో శని, గురువు మారుతూ ఉన్నారు. కాబట్టి ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, పెళ్లి విషయాల పరంగా, సినిమాల పరంగా అతను చాలా సమస్యలు ఎదుర్కొంటాడు.

ప్రభాస్ అనేవాడు ఒక వ్యక్తి కాదు. అతన్ని నమ్ముకుని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కాబట్టి.. ప్రభాస్ వీటిని నమ్మి.. వాటికి దోష నివారణలు వంటివి చేయించుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ జాతకాలు వంటివి నమ్మక పోవడానికి కారణం.. అతను క్రైస్తవ మతం తీసుకోవడమే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు కాదు.. 2007 టైంలో ప్రభాస్ మతం మార్చుకున్నాడు అనే టాక్ బలంగా వినిపించింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus