ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఇతను కనిపిస్తున్నాడు. రూ.50 వేలు, లక్ష ఇతనికి ముట్టజెప్పి మరీ ఇంటర్వ్యూలు పెట్టించుకుంటున్నారు అని కొందరు అంటున్నారు. మరోపక్క సెలబ్రిటీలు కూడా ఇతనితో యాగాలు, హోమాలు చేయించుకుంటున్నారు. అందుకోసం కూడా లక్షలు ఖర్చు పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వేణు స్వామి గతంలో చెప్పినట్లు సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు.
రాంచరణ్ – ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారు అని కూడా ఇతను చెప్పాడు. అలాగే ఈ ఏడాది ఓ యంగ్ హీరో మరణిస్తాడు అని ఇతను చెప్పాడు. ఆ విధంగా తారకరత్న చనిపోవడం కూడా మనం చూశాం. అయితే ఈ ఏడాది మరో హీరోయిన్ కూడా చనిపోతుంది అని ఆయన కామెంట్ చేయడంతో అందరూ సమంత గురించి చర్చించుకుంటున్నారు. గతేడాది సమంత మాయోసైటిస్ అనే వ్యాధి భారిన పడింది. దాని వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడింది.
ఆమె సినిమాల ప్లానింగ్స్ కూడా డిస్టర్బ్ అయ్యాయి. అలాగే ఆమె మోహంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ఖుషి’ సినిమా చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆ సినిమాలో సమంత చాలా ఏజ్డ్ గా కనిపించింది. హీరో విజయ్ దేవరకొండ పక్కన సమంత ఎక్కువ వయసు కలిగిన అమ్మాయి అని చిన్నపిల్లలను అడిగినా చెప్పేస్తారు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు.
అయితే ఎలాగోలా సమంత కోలుకుంటుంది. ఆమె సంగతి పక్కన పెడితే తాజాగా.. (Venu Swamy) వేణు స్వామి 40 ఏళ్ళ లోపు వయసున్న ఓ హీరోయిన్ ఈ ఏడాది చనిపోతుంది అని ఇటీవల అతను చెప్పుకొచ్చాడు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!