Allu Arjun: అల్లు అర్జున్.. నిర్మాతల పాలిట కల్పవృక్షమట.. ఎన్నాళ్లంటే?

వేణు స్వామి.. గత రెండేళ్లుగా ఈ పేరు ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే.. సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని ఈయన ముందుగా చెప్పాడు. చెప్పినట్టు జరిగింది అని అంతా భావించారు. ఆ తర్వాత రాంచరణ్ – ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులవుతారు అని 5 ఏళ్ళ క్రితమే చెప్పినట్టు ఇతను చెప్పుకుంటాడు. కానీ సినీ పరిశ్రమ అంటే సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వేణు స్వామి హవా ఇప్పుడు నడుస్తుంది.

వర్షానికి పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లా.. అనేక యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకురావడంతో వాటికి ఇతను స్పెషల్ గెస్ట్ అయిపోయాడు. ఏ ఛానల్లో ఇతను ఇంటర్వ్యూ ఇచ్చినా.. వారి జాతకం ఎలా ఉంది? వీరి జాతకం ఎలా ఉంది? అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు యాంకర్లు. వాటికి ఇతను ఇచ్చే సమాధానాలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఇతను అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు.

వేణు స్వామి మాట్లాడుతూ.. “అల్లు అర్జున్ జాతకం చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పై ఏ నిర్మాత అయినా సరే పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు సంపాదిస్తారు.ఇంకో 10 సంవత్సరాల పాటు అల్లు అర్జున్ కి తిరుగుండదు. వరుస సక్సెస్ లు అందుకుని అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మార్మోగుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus