వేణు స్వామి (Venu Swamy) అందరికీ తెలుసు కదా.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి ‘జగపతి’ ‘అతడు’ (Athadu) వంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాడు. నటుడిగా ఫెయిల్ అవ్వడం వల్లే అనుకుంట.. అదే సినీ పరిశ్రమ గురించి ఫ్రీగా జోస్యం చెప్పి పాపులర్ అయ్యాడు. బాబు గోగినేని వల్ల ఇతను సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు అని చెప్పాలి. దీంతో బోలెడన్ని యూట్యూబ్ ఛానల్స్ లో షోలు చేస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కి ఇతని అవసరం ఉంది.వందల్లో ఉన్నాయి కాబట్టి.. ఇతని హవా నడుస్తోంది. కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాల వరకు మాట్లాడి వదిలేస్తే సరిపోతుంది కానీ, వారి పర్సనల్ లైఫ్ గురించి, వారి కెరీర్ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ కొంతమంది హీరోల అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
అయితే ఇతని జాతకాలకి భయపడి కొంతమంది ఇతను చెప్పిన పూజలు ఆచరిస్తారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇతను ఒక హీరోయిన్ తో పూజలు వంటివి చేయించాడు. ఆ ఫోటో కూడా వైరల్ అవుతుంది. అయితే అందులో ఉన్న హీరోయిన్ ఎవరో సరిగ్గా కనిపించడం లేదు.
డింపుల్ హయతీ (Dimple Hayati) అని కొందరు అంటున్నారు. అది పక్కన పెడితే.. వేణు స్వామి చేయిస్తున్న పూజలు అనుకోవచ్చు, హోమాలు అనుకోవచ్చు.. మధ్యలో వైన్ బాటిల్స్ కూడా ఉండటాన్ని మనం గమనించాలి. గతంలో అతను మద్యంతో తీర్థం ఇస్తాము అన్నట్టు అతను చెప్పాడు. బహుశా అందుకే అయ్యి ఉండొచ్చు.
https://twitter.com/MilagroMovies/status/1764975631945945171
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!