‘టాక్సీ’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్

ఇటీవలి కాలంలో మెలోడీ పాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా అయ్యాడు సింగర్ సిద్ద్ శ్రీ‌రామ్. ఆయన పాటలో ఉండే కమ్మదనం నేటితరం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి ఆల్బమ్‌లో కూడా సిద్ శ్రీరామ్ గొంతు కలుపుతుండటం చూస్తున్నాం. ఇదే బాటలో తాజాగా ‘టాక్సీ’ అనే సినిమా కోసం ఓ యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ ఆలపించారు సిద్ శ్రీరామ్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

”వేవేలా తారలే నా చుట్టూ చేరి మురిసేనా.. మేఘాల పైన తేలుతున్నా” అంటూ మొదలైన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సింగర్ సిద్ శ్రీరామ్ మరోసారి తన గొంతుతో మ్యాజిక్ చేశారు. ఇక ఈ పాటలో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన విజువల్స్ నేటితరం ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ హైలైట్ అవుతుండగా.. మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. దీంతో విడుదలైన కొద్ది సేపటికే ఈ సాంగ్ వైరల్‌గా మారింది.

హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ (ఎం.డి) నిర్మిస్తున్న ఈ టాక్సీ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహిస్తున్నారు. బిక్కి విజయ్ కుమార్(M.Tech) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టాక్సీ ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అతి త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus