‘లైగర్’ సినిమా ఫలితం విజయ్ దేవరకొండ మీద ఎలాంటి ఫలితం చూపించింది? దీనికి సమాధానం కావాలంటే ‘సైమా’ ఈవెంట్లోనికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ ఈవెంట్‌కి వచ్చినప్పుడు విజయ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చెబుతుంది విజయ్ ‘లైగర్’ ఫీలింగ్ ఏంటో? దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘జేజీఎం’ సినిమా గురించి విజయ్ను ఓ యాంకర్ అడిగితే..
దానికి విజయ్ కాస్త కొత్తగా స్పందించాడు. ఇప్పటి వరకు విజయ్ ఫేస్‌లో అలాంటి ఎక్స్ప్రెషన్ గానీ, మాటలో అలాంటి ఫీలింగ్ గానీ చూడలేదు అంటున్నారు అక్కడున్నవాళ్లు. అంతగా ఏమన్నాడు అనుకుంటున్నారా? ఏమీ అనలేదు.. అదే ఇక్కడి సమస్య. ఏదైనా విషయం గురించి అడిగితే.. ఓపెన్‌గా మాట్లాడే విజయ్.. ‘జేజీఎం’ గురించి అడిగితే లైట్ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఇక ఆ సినిమా లేదు, ఆగిపోయింది అని వస్తున్న వార్తలకు ఊతం ఇచ్చినట్లు అయ్యింది.
ఓవైపు ఛార్మి ‘పుకార్లకు రిప్’ అని హంగామా చేస్తుంటే.. విజయ్ ఇలా మరిన్ని పుకార్లకు ఆస్కారం ఇచ్చాడు. ఆ సినిమా గురించి తర్వాత చెబుతాను అనో, లేక ఇప్పుడు ఆ సినిమా గురించి వద్దు, తర్వాత మాట్లాడదాం అనో చెప్పుంటే ఓ లెక్క. అంతేకానీ సరిగ్గా సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి జారుకోవడం కొత్త ప్రశ్నలకు దారి తీస్తోంది. పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ ఆ మధ్య ‘జేజీఎం’ అలియాస్ ‘జన గణ మన’ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
అందులో విజయ్, పూజా హెగ్డే మీద కొన్ని సీన్స్ కూడా తీశారు. అయితే అక్కడితో సినిమా ఆపేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ‘లైగర్’ ఫలితమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. ఇంతకీ విజయ్ ఏమన్నాడో చెప్పలేదు కదా. ‘‘మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి’’ అని అడిగితే..
సైమా గురించి మాట్లాడి ఈవెంట్‌ను ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా ‘ఖుషీ’ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!