అప్పట్లో చాలా బాధపడేవాడ్ని..!

  • January 20, 2021 / 06:45 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా లైగర్. రీసంట్ గా ఈ సినిమా పోస్టర్ ని తనదైన మార్క్ తో రిలీజ్ చేశాడు డైరెక్టర్ పూరీ. ఈ పోస్టర్ రిలీజ్ అవ్వగానే విజయ్ దేరవకొండ అభిమానుల ఆనందాన్ని అవధులు లేకుండా పోయింది. కేక్ కటింగ్ సంబరాలు, పోస్టర్ కి పాలాభిషేకాలు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ టీమ్ అంటూ ఒక గ్రూప్ గా ఏర్పడి పోస్టర్ కి నీరాజనాలు పట్టారు, టపాసులు పేలుస్తూ పండగలా చేశారు.

కొంతమంది అయితే లైగర్ అంటూ ట్యాటూస్ కూడా ఒంటిపైన వేసుకున్నారు. ఇందతా కట్ చేసి వీడియోగా పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. అభిమానులని ఉద్దేశిస్తూ భావోద్వేగమైన పోస్ట్ చేశాడు. మీరు నా ప్రేమ, నా బలం. పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూపించిన ఈ అభిమానం నన్ను బాగా భావోద్వేగానికి గురి చేసింది. నాపై చూపించిన ఈ ప్రేమకి నేను ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యాను, ప్రేక్షకుల్లో కనీసం ఒక్కరైనా సరే నా సినిమా చూస్తారా లేదా అని అనుకునేవాడ్ని. నా యాక్టింగ్ ని మీరు గుర్తిస్తారా లేదా అని బాధపడేవాడ్ని.

ఒకానొక సమయంలో నా సినిమాలు చూసేందుకు థియేటర్ కి వస్తారా రారా అని కూడా అనిపించేది. అప్పుడు చాలా బాధ పడేవాడ్ని అని ఇప్పుడు మీ సెలబ్రేషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అంతేకాదు, టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంబరాలు షురూ అవుతాయని, దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నా అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus