విజయ్ దేవరకొండ కావాలని అన్నాడా లేక సరదాగా అన్నాడా తెలియదు కానీ.. నిన్న జరిగిన “టెర్మినేటర్ 4” తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ అనంతరం విలేఖరులతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. “నేను బచ్చాగాడ్ని.. హాలీవుడ్ లో ఆర్నాల్డ్ “వరల్డ్ ఫేమస్ లవర్” ట్రైలర్ ను లాంచ్ చేయాలి” వంటి కామెంట్స్ చేసి మీడియాను బాగా ఆకట్టుకొన్నాడు. అదే సమయంలో.. యాంకర్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ ఆర్నాల్డ్ 300 మందికిపైగా జనాలను సినిమాలో చంపేశారట” అని చెప్పగా.. దానికి సమాధానంగా విజయ్ “మన హీరోలు అంతకంటే ఎక్కువ మందినే లేపేశారు” అని నవ్వేశాడు.
ఇది ఈవెంట్ వరకూ ఫన్నీగానే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం డిస్కషన్ కు దారి తీసింది. విజయ్ దేవరకొండ కావాలనే అలా స్టార్ హీరోలను, అగ్ర కథానాయకులను టార్గెట్ చేసి ఆ డైలాగ్ వేశాడని కోప్పడుతున్నారు స్టార్ హీరోల అభిమానులు. ఈ డిస్కషన్ ఎక్కువసేపు ఉండదనుకోండి. కానీ.. విజయ్ దేవరకొండ ఇలా తెలుగు హీరోల గురించి హాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ దగ్గర తక్కువ చేసి వెటకారంగా మాట్లాడడం మాత్రం బాగోలేదు.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?