మాట మార్చిన విజయ్ దేవరకొండ?

తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ‘కభీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. ఊహించిన దాని కంటే ఈ చిత్రం అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ చిత్రాన్ని అక్కడ ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేసారు. సుమారు 250 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ ‘కభీర్ సింగ్’ చిత్రం పై షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

విజయ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’… ప్రమోషన్లలో భాగంగా బెంగుళూరుకు వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయ్ కు.. ఓ విలేకరి ‘మీరు ‘కభీర్‌సింగ్‌’ చూశారా’ అని ప్రశ్నించింది. దీనికి విజయ్ జవాబిస్తూ… “షాహిద్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసుంటారు. మళ్ళీ ఆ సినిమా చూడటం వల్ల నాకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ కథ మొత్తం నాకు తెలుసు. తెలుగులో నేనే హీరోగా నటించాను. మళ్ళీ ఎందుకు చూడటం? సందీప్ రెడ్డి వంగా నా మనిషి.. ఆయన తీసిన హిందీ సినిమా కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నాను. అయితే అది ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది? దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏముంది?” అంటూ చెప్పుకొచ్చాడు. ఈమధ్యే ‘నేను ‘కభీర్ సింగ్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఫ్రాన్స్ లో షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల చూడలేకపోయాను. హైదరాబాద్ వచ్చాక వైరల్ ఫీవర్ వచ్చింది. త్వరలోనే చూస్తాను. నా స్నేహితుడు సందీప్ ..ఈ చిత్రంలో ఎటువంటి మార్పులు చేశాడో చూడాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చిన విజయ్ ఇలా మాట మార్చడం అందరికీ షాకిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus