రష్మిక మందన్నా ముఖ్య పాత్రలో మరియు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ గత శుక్రవారం నవంబర్ 7న రిలీజ్ అయింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా నిన్న నైట్ హీరోయిన్ రష్మిక మందన , బాలానగర్ విమల్ థియేటర్ లో సందడి చేశారు. రష్మిక అభిమానులు అభిమాన హీరోయిన్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
అయితే ఈ రోజు నవంబర్ 12న “గర్ల్ ఫ్రెండ్” మూవీ సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు అంట. ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి విజయ్, రష్మిక ఒకే వేదికపై కనపడనున్నారు. అయితే విజయ్ , రష్మిక ల మ్యారేజ్ రాజస్థాన్ లోని జైపూర్ లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మూవీ రీలీజ్ కు ముందు ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ” ఇది చాలా సున్నితమైన, విలువైన సబ్జెక్ట్ ఈ మూవీ లో ఉంది అని, యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పకుండా చుస్తే బాగుంటుంది.
ఈ సినిమాలో ఎన్ని పాటలు, ఎన్ని ఫైట్లు, ఎన్ని పంచ్‌లు ఉన్నాయి?” అనేది పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని కోరారు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మనసుల్లో దాగి ఉన్న కోరికలు, భావోద్వేగాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా వివరించారు అన్నారు. సినిమా కథ నెమ్మదిగా, సున్నితంగా మొదలై… చివరికి ఒక్కసారిగా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ముగుస్తుందని, కథ చాలా రోజుల వరకు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది అని కూడా అన్నారు.