టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన బ్రేకప్ సంగతుల గురించి బయటపెట్టేశాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాను విజయ్ నిర్మించాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ తన తమ్ముడు ఆనంద్ తో కలిసి ఓ చాట్ లో పాల్గొన్నారు. దేవరకొండ బ్రదర్స్ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పలు ప్రశ్నలకు వీళ్లు సమాధానాలు చెప్పారు.
ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నాడా..? అనే ప్రశ్నకు విజయ్.. ”ఈ మధ్య నాకు ఒక హార్ట్‌బ్రేక్ జరిగింది. ఇప్పటివరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నా..” అంటూ చెప్పుకొచ్చాడు. అలానే విజయ్ ఎప్పుడైనా టాటూ వేయించుకున్నారా? భవిష్యత్తులో వేయించుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు.. విజయ్ ”ఇప్పటివరకూ వేయించుకోలేదు. ఒకవేళ ఈరోజు నచ్చిందని వేయించుకున్నాక.. రేపు ఎప్పుడైనా నచ్చకపోతే.. అందుకే ఎప్పుడూ ట్రై చేయలేదు” అంటూ సమాధానమిచ్చారు.
మరోవైపు ఆనంద్ దేవరకొండ.. తాను ఇంకా సింగిల్ అంటూ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు. దామోదర దర్శకత్వం వహించిన ‘పుష్పక విమానం’ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ వెరైటీగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!