కొద్దిరోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులు, సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి నోటీసులు పంపారు తెలంగాణ పోలీసులు. తర్వాత పోలీసులు వాళ్ళని స్టేషన్ కి పిలిచి విచారించడం జరిగింది. తర్వాత అంతా ముగిసినట్టే అనుకుంటే.. తర్వాత ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.
వాళ్ళు మళ్ళీ సెలబ్రిటీలను పిలిచి విచారించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా విజయ్ దేవరకొండని విచారణకి పిలవడం జరిగింది.
ఈడీ విచారణ తర్వాత మీడియాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ” మీరంతా ముందుగా నన్ను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఈడీ వాళ్ళు నన్ను విచారణకి పిలిచారు అనే స్క్రోలింగ్ ను ఆపాలి. ఎందుకంటే నేను గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈడీ సభ్యులు కూడా క్లారిటీ తెచ్చుకుని నా దగ్గర వివరాలు తీసుకుని పంపించేశారు. నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్. బెట్టింగ్ యాప్ కాదు.. మరోసారి మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నా. గేమింగ్ యాప్ వేరు. బెట్టింగ్ యాప్ వేరు. నేను ప్రమోట్ చేసిన A3 అనే గేమింగ్ యాప్ చట్టరీత్యా అన్ని అనుమతులు తీసుకుంది. దానికి జీఎస్టీ వంటివి అన్నీ ఉన్నాయి. A3 అనేది వివిధ క్రీడలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది.
#VijayDeverakonda Clarification on Gaming App Promotion Issue pic.twitter.com/WxyxuCXWJn
— Filmy Focus (@FilmyFocus) August 6, 2025