దళపతి విజయ్ బాక్సాఫీస్ స్టామినాకు డైరెక్టర్‌తో సంబంధం లేదని మరోసారి ప్రూవ్ అవుతోంది. ‘GOAT’ సినిమాతో ఆశించిన విజయం రాకపోయినా, ఆయన మార్కెట్ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో వస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు జరుగుతున్న ప్రీ-రిలీజ్ బిజినెస్ చూసి ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు.
Jana Nayagan
లోకేష్ కనగరాజ్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లు లేకుండానే, కేవలం విజయ్ పేరు మీదే దాదాపు 400 కోట్ల వ్యాపారం జరగడం సంచలనంగా మారింది. పొంగల్ 2026 (జనవరి 9) టార్గెట్‌గా వస్తున్న ఈ సినిమా బిజినెస్ లెక్కలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
సినిమా థియేటర్లలోకి రాకముందే, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం, ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 110 కోట్లు చెల్లించిందట. ఇక ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలింస్ 75 కోట్లకు దక్కించుకుందని టాక్. ఈ రెండు డీల్స్‌తోనే బడ్జెట్‌లో చాలా పెద్ద మొత్తం రికవర్ అయిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉంది. సొంత రాష్ట్రం తమిళనాడు హక్కులను రోమియో పిక్చర్స్ 100 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేరళ హక్కులను కూడా వారే 15 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్‌తో కలుపుకుంటే, సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇది విజయ్ కెరీర్‌లోనే ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి.
డైరెక్టర్ హెచ్. వినోత్ (‘వలిమై’, ‘తునివు’ ఫేమ్) మంచి దర్శకుడే అయినా, ‘స్టార్ డైరెక్టర్’ బ్రాండ్ ఉన్నవారు కాదు. అయినా ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే, ఇది 100% విజయ్ స్టార్‌డమ్ వల్లే. ‘GOAT’ ఫ్లాప్ అయినా, విజయ్ రాజకీయ ప్రవేశం (తమిళగ వెట్రి కళగం) ప్రకటన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ‘జన నాయగన్’ టైటిల్‌కు హైప్ వచ్చింది. సినిమా టైటిల్ కూడా పొలిటికల్‌గా ఉండటం ఈ బిజినెస్‌కు భారీగా హెల్ప్ అయింది.
ప్రస్తుతం ఈ 300 కోట్ల బిజినెస్‌కు ఇంకా కర్ణాటక, నార్త్ ఇండియా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కలపాల్సి ఉంది. శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే, ‘జన నాయగన్’ మొత్తం ఓవరాల్ బిజినెస్ సులభంగా 400 కోట్ల మార్కును దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.