Vijay Sethupathi family: విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్ నటుడే..! తమిళంలో హీరోగా సక్సెస్ అయిన తర్వాత తనకు నచ్చిన ప్రతీ పాత్రని ఓకే చేస్తూ సౌత్ మొత్తం పాపులర్ అయిపోయాడు. ‘నవాబ్’ ‘పేట’ ‘సైరా నరసింహ రెడ్డి’ ‘మాస్టర్’ ‘ఉప్పెన’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం కమల్ హాసన్- లోకేష్ కనగరాజన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విక్రమ్’ మూవీలో కూడా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

దాంతో పాటు మరో డజన్ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే ఎంత బిజీగా గడిపినా ఫ్యామిలీకి కేటాయించాల్సిన సమయం విషయంలో కానీ.. అతనికి సాయం చేసిన మనుషులని కానీ అస్సలు మర్చిపోడు మన మక్కల్ సెల్వన్. ఈరోజున అతనికి స్టార్ డం ఉందన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి.. అతను కెరీర్ ప్రారంభంలో సాయం చేసిన మనుషులు చనిపోతే అతను దగ్గరుండి తన సొంత ఖర్చుతో అంత్యక్రియలు జరిపించిన సందర్భాలను మనం చూస్తూ వచ్చాము.

అలాంటి వ్యక్తిని ఇటీవల బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో కొట్టారు అనే వార్త అందరినీ బాధపెట్టింది. ఆ వార్తల పై విజయ్ సేతుపతి వివరణ కూడా ఇచ్చాడు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే విజయ్ సేతుపతి ఫ్యామిలీ గురించి పెద్దగా జనాలకి తెలిసుండదు.ఇతని భార్య పేరు జెస్సీ. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు. కూతురు శ్రీజ, కొడుకు సూర్య. విజయ్ సేతుపతి.. ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus