తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీగా టీవీకే అవతరించింది. ఆ తర్వాత వివిధ పరిణామాల తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ గెలిచినప్పటి నుండి.. ఇప్పుడు సీఎంగా ఆసక్తికర, కీలక నిర్ణయాలు తీసుకున్నంత వరకు విజయ్‌కి సినిమా పరిశ్రమ నుండే కొన్ని రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. విశాల్ తొలుత ఓ రిక్వెస్ట్ చేయగా.. ఆ తర్వాత కమల్ హాసన్.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా ఓ రిక్వెస్ట్ చేశారు. ఆ రెండూ కోలీవుడ్ అభివృద్ధి కోసమే అని చెప్పొచ్చు.
కోలీవుడ్ సినిమా పరిశ్రమ చాలా ఏళ్లుగా ఉన్నా.. టాలీవుడ్ అంత వసూళ్ల హైప్ రావడం లేదు. అలాగే లాభాలు కూడా ఆశించినంత ఉండటం లేదు. మరోవైపు థియేటర్ల వ్యాపారం కూడా ఆశించిన మేర ఉండటం లేదు. అలాగే ఓటీటీలు కూడా కోలీవుడ్ విషయంలో అంత లాభదాయకంగా లేదు అని సమాచారం. ఇప్పుడు ఈ విషయాన్నే విజయ్ సేతుపతి కూడా మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ చేసిన విజ్ఞప్తినే విజయ్ సేతుపతి అడిగాడు.
కమల్ హాసన్ విజ్ఞప్తి చేసినట్లుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ఓటీటీని ప్రారంభిస్తే ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి విజయ్‌ను విజయ్ సేతుపతి కోరాడు. ఓటీటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డాడు. దీంతో సినిమా వృత్తి గందరగోళంగా ఉందన్నాడు. ఈ సమయంలో ప్రభుత్వమే ఓటీటీని నిర్వహిస్తే బాగుంటుంది అని విజయ్ సేతుపతి ఉద్దేశం.
అలాగే విజయ్ సేతుపతి మరో విషయం కూడా ప్రస్తావించారు. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం సినిమా టికెట్ ధరలను పెంచారని, మిగతా వస్తువులు, సర్వీసుల ధరలు పెరిగిన నేపథ్యంలో సినిమా టికెట్ ధరను కూడా పెంచేలా చూడాలని విజయ్ సేతుపతి కోరారు. మరి ఈ విషయంలో సీఎం విజయ్ జోసెఫ్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.