Vijay Setupathi: విజయ్ సేతుపతి లిస్ట్ లో మరో వెబ్‌సిరీస్‌!

  • November 19, 2022 / 07:03 PM IST

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. విలక్షణ నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. అభిమానులందరూ అతడిని ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. ‘ఉప్పెన’, సైరా నరసింహ్మారెడ్డి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు విజయ్ సేతుపతి. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరోపక్క విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మెప్పిస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

తమిళంతో పాటు తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారాయన. ఇప్పుడు ఓటీటీలో ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హిందీ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ని పట్టాలెక్కించారు. ఈ సిరీస్ లో షాహిద్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ అప్డేట్ సౌత్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

సౌత్ ఇండియాకు చెందిన ఖరీదైన వెబ్ సిరీస్ లో నటించడానికి విజయ్ సేతుపతి సిద్ధమయ్యారట. ఈ సిరీస్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ నిర్మించబోతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను మణికందన్ అనే దర్శకుడు టేకప్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను నిర్మించబోతున్నారు. ఇదివరకు మణికందన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.

ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి వెబ్ సిరీస్ కోసం పని చేయబోతున్నారు. మరి ఈ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus