Vijayendra Prasad: మహేష్ జక్కన్న కాంబో మూవీపై మరో అప్ డేట్.. నెక్స్ట్ లెవెల్ అనేలా?

Advertisement

మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా అడవులలో సాగే అడ్వెంచర్ సినిమా అని (Vijayendra Prasad) విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియానా జోన్స్ లా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తామని హాలీవుడ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సినిమా గురించి ఇంతకు మించి చెప్పలేనని ఆయన అన్నారు.ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం అందుతోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 2024 సంవత్సరం జనవరిలో మొదలుకానుంది. దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ భారీ రేంజ్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.



2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news