‘వినరో భాగ్యము విష్ణు కథ’ .. బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే

  • February 23, 2023 / 04:35 PM IST

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.కానీ వీక్ డేస్ లో మాత్రం డౌన్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.74 cr
సీడెడ్ 0.61 cr
ఉత్తరాంధ్ర 0.31 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.15 cr
గుంటూరు 0.17 cr
కృష్ణా 0.17 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.91 cr (షేర్)

‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.3.91 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.59 కోట్లు షేర్ ను రాబట్టాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus