Ravi Teja: ఆ వైరల్‌ పాట రవితేజ సినిమాలో ఉంటుందా?

  • October 8, 2021 / 04:41 PM IST

వైరల్‌గా మారిన పాటలను… తన సినిమాలోకి తీసుకోవడం రవితేజకు బాగా అలవాటు. అలా గతంలో చాలా సినిమాల్లో రవితేజ ఈ తరహా ప్రయోగాలు చేశారు. ‘కృష్ణ’ సినిమాలో ‘అప్పిడి పోడో..’ పాటను ‘అదరగొట్టు..’ అంటూ తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘రాజా దిగ్రేట్‌’లో ‘జీడి గింజలు..’ పాటను పెట్టారు. ఇప్పుడు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాకు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారని టాక్‌. సోషల్‌ మీడియాలో ఇటీవల బాగా వైరల్‌ అయిన పాటల్లో…

‘బుల్లెట్‌ బండి..’ ఒకటి. కొత్త పెళ్లి కూతురు పాడుకునే పాటలా ఉండే ఈ గీతాన్ని… ‘రామరావు ఆన్‌ డ్యూటీ’ సినిమాలోకి తీసుకుంటున్నారని టాక్‌. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ ప్రైవేట్‌ ఆల్బమ్‌ రూపకర్తలతో చర్చించారని తెలుస్తోంది. అంతే కాదు ఈ పాటను మోహన భోగరాజుతోనే పాడిస్తారని అంటున్నారు. ఇక ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా గురించి చూస్తే… ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇందులో రవితేజ కూడా నిర్మాతగా పాలుపంచుకుంటున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రవితేజ కలెక్టర్‌గా కనిపిస్తారని టాక్‌.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus