900 చిల్లర ఓట్లు… 600 చిల్లర ఓట్ల పోలింగ్. వీటి కౌంటింగ్ జరగడానికి ఎంత టైమ్ పడుతుంది. మహా అయితే ఒక పూట పడుతుంది. కానీ ఆ ఓట్ల లెక్కింపు రెండు రోజులు జరిగింది. అందులోనూ ముందు రోజు ‘గెలిచారు’ అంటూ వార్తలొచ్చిన వాళ్లు రెండో రోజుకు వచ్చేసరికి ఓడిపోయారు. అసలు గెలిచారా, ఓడారా అనే ఊసేలేని ఇంకొంతమంది రెండో రోజు విజయగర్వంతో స్టేజీ మీద చప్పట్ల మోత మోగించారు. అసలు ‘మా’ కౌంటింగ్‌లో ఏం జరిగింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబరు 10న సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయి. మూడున్నర ఆ సమయంలో ఈసీ సభ్యుల కౌంటింగ్ మొదలైంది. అక్కడికి ఓ అరగంటకే తొలి ఫలితాలు వచ్చేశాయి. అందులో వచ్చిన పేర్లలో నటి, యాంకర్ ఒకరు. భారీ ఆధిక్యంతో అనసూయ గెలిచింది అంటూ టీవీలు, వెబ్‌సైట్లు ఊదరగొట్టాయి. కానీ అక్టోబరు 11న సాయంత్రం ప్రకటించిన ఫలితాల్లో ఆమె పేరు లేదు. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే ప్రశ్నించారు. భారీ విజయం అన్నారు… రెండోరోజు నా పేరు లేదు అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.
అయితే తొలి రోజు వచ్చిన వార్తలు కరెక్ట్ కాదు అనుకుంటే తొలి రోజు వచ్చిన చాలా ఫలితాలు అలానే ఉన్నాయి కదా. అసలు 654 ఓట్ల లెక్కింపు కోసం రెండో రోజు కూడా కేటాయించడం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న. తొలి రోజు ఈసీ సభ్యల ఓట్ల లెక్కింపు తర్వాతే మిగిలినవి లెక్కించారు కదా. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం జరిగిన పోటీలో బెనర్జీ ఓడిపోయారు అంటూ వార్తలొచ్చాయి. మాదాల రవిపై ఆయన ఓటమి పాలయ్యారని అన్నారు. కానీ రెండో రోజు చూస్తే… బెనర్జీ ఘనవిజయం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తొలి రోజు లెక్కింపులో హేమ గెలిచారు అని ఒకసారి, లేదని ఒకసారి అన్నారు.
దాని మీద క్లారిటీ రెండో రోజు వచ్చినా… అసలు తొలి రోజు లెక్కింపులో లీకులు ఇచ్చిందెవరు, జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసింది ఎవరు. ఇక్కడే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. నిన్న ప్రెస్‌మీట్‌లో కూడా మంచు విష్ణు ఇదే మాట చెప్పుకొచ్చారు. అసలు ‘మా’ అధ్యక్ష పదవి కోసం జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు మొదలుకాకుండానే… కొన్ని టీవీ ఛానళ్లు 400కుపైగా ఓట్ల తేడాతో విష్ణు గెలిచాడు అంటూ ఊదరగొట్టాయి. ఈ ప్రచారం తర్వాత ఎప్పుడో గంట తర్వాత కౌంటింగ్ మొదలైంది. విష్ణు 100కుపైగా ఓట్ల తేడాతో గెలిచాడు. మరి ఆ 300 ఓట్ల లెక్కేంటి. ‘మా’ కౌంటింగ్‌లో మతలబు జరిగిందా? లేక టీవీ మీడియా మతలబా అనేది తెలియాలి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు