Virupaksha Collections: ‘విరూపాక్ష.. రూ.100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా? లేదా?

  • May 16, 2023 / 06:35 PM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అభినవ్ గోమఠం వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.

ఏప్రిల్ 21న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ చిత్రం. కొత్త సినిమాలు రిలీజ్ అయినా అవి ‘విరూపాక్ష’ ముందు నిలబడలేకపోయాయి.ఇప్పటికీ డీసెంట్ షేర్స్ ను రాబడుతూనే ఉంది ఈ మూవీ. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 15.92 cr
సీడెడ్ 5.48 cr
ఉత్తరాంధ్ర 5.16 cr
ఈస్ట్ 2.62 cr
వెస్ట్ 1.89 cr
గుంటూరు 2.47 cr
కృష్ణా 2.49 cr
నెల్లూరు 1.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 37.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.88 cr
ఓవర్సీస్ 5.86 cr
మిగతా భాషల్లో 0.53 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 46.52 cr (షేర్)

‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రానికి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 25 రోజులు పూర్తయ్యేసరికి ..రూ.46.52 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కు రూ.23.72 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.

గ్రాస్ పరంగా రూ.92 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మిగతా భాషల్లో కనుక కొంతలో కొంత రాణించినా ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus