కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయనకు తమిళంలో ఎంత మంచి ఆదరణ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉంది ఇక ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంటాయి. ఇకపోతే విశాల్ ఈ మధ్యకాలంలో వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నెల 15వ తేదీ విశాల్ నటించినటువంటి మార్క్ ఆంటోనీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం అవార్డ్స్ తనుకు చెత్తతో సమానం అంటూ చేసినటువంటి కామెంట్స్ వివాదంగా మారాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశాల్ (Vishal) నిర్మాతల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు నిర్మాతల గురించి తాను నిర్మాణ సంస్థను ప్రారంభించడం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఈయన సమాధానం చెబుతూ ఒకానొక సమయంలో తాను నిర్మాతల నుంచి ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. అందుకే తాను సొంతంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించానని విశాల్ తెలిపారు. సినిమా శుక్రవారం విడుదల అవుతుంది అంటే కొంతమంది నిర్మాతలు గురువారం సాయంత్రం ఫోన్ చేసి తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారు.
ఫైనాన్షియర్ లు డబ్బు కావాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారని ఇవ్వకపోతే సినిమాని విడుదల చేయనివ్వము అంటూ తనని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసేవారు. ఇలా ఎమోషనల్ గా మాట్లాడి తన నుంచి డబ్బు కట్టించేవారని తెలిపారు. ఇలా నిర్మాతల టార్చర్ తాను భరించలేకపోయానని అందుకే తానే నిర్మాణ సంస్థను ప్రారంభించాను అంటూ విశాల్ కామెంట్స్ చేశారు. ఇలా నిర్మాతల గురించి ఈయన కామెంట్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!