ఒక హీరో ఒక నిర్మాతను హత్య చేస్తా అన్నాడట. అదే హీరోపై ఇప్పుడు అదే దర్శకుడు కమ్ నిర్మాత భయంతో కేసు పెట్టాడు. అసలు హత్య చేస్తాను అని బెదిరింపులు వస్తున్నాయి అన్న దర్శక నిర్మాత ఎవరు? ఏ హీరోపై ఈ వ్యాఖ్యలు చేసాడో తెలియాలంటే మాత్రం మనం ఈ మ్యాటర్ చదవాల్సిందే, విషయంలోకి వెళితే, తమిళ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, తెలుగులో సైతం విశాల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే స్వతహాగా తెలుగువాడైన విశాల్ పై ఇప్పుడు హత్యా బెదిరింపు కేసు నమోదైంది. అదే క్రమంలో ఈ మధ్య అనేక వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూ ఉండడం, ఇప్పుడు ఇతనిపై మరో వివాదం చెలరేగడం తమిళనాట చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇంతకూ మ్యాటర్ ఏంటి అంటే, విశాల్ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని నిర్మాత, దర్శకుడు సురేష్ కామాక్షి చెన్నయ్, పడపళనిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆ మద్య జరిగిన నిర్మాత మండలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి సురేష్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్య తమిళ ఇండస్ట్రీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలి సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానని ఇది వారికి మింగుడు పడటం లేదని వాపోయారు. ఈ కక్ష్య తనపై ఉంచుకొని విశాల్ తన అభిమానులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడు కమల్ కన్నన్, మరో అభిమాని కలసి తనపై రౌడీయిజం చేశారని తెలిపాడు. అయితే ఆరోపణల వరకూ ఎవరైన ఎవరిపైనా అయినా చెయ్యవచ్చు. కానీ అవి ప్రూవ్ కావాలిగా. చూద్దాం మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.