విష్ణు ప్రియ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న క్రేజీ యాంకర్స్ లో ఒకరు. ‘పోవే పోరా’ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తర్వాత వరుస సినిమాల్లో కూడా అవకాశాలు పొందింది. ‘చెక్ మేట్’ ‘వాంటెడ్ పండుగాడ్’ ‘దయ'(వెబ్ సిరీస్) ‘ది 100′ వంటి సినిమాల్లో కూడా ఈమె నటించి తన టాలెంట్ చూపించిన సంగతి తెలిసిందే.’చెక్ మేట్’ సినిమాలో అయితే మెయిన్ హీరోయిన్ కావడంతో ఇంటిమేట్ సీన్లలో, ముద్దు సీన్లలో కూడా హద్దు అదుపు లేకుండా నటించినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 8’ లో కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఈమె చేసిన సందడి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఖాతాల్లో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణం అదే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో ఆమె గ్రీన్ కలర్ శారీలో యమ గ్లామరస్ గా ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలను కనుక గమనిస్తే.. ఈ ఫోటో షూట్ ఓ నగల కొట్టులో జరిగినట్లు స్పష్టమవుతుంది. విష్ణు ప్రియ తన నడుముకు ఆభరణం ధరించుకొని వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. కానీ ఆ నగల కంటే కూడా ఎక్కువగా విష్ణు ప్రియ గ్లామరే హైలెట్ అయ్యింది అని చెప్పాలి.