విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై ఇప్పుడిప్పుడే టాప్ పొజిషన్ కి చేరుకుంటూనే మరోపక్క సినిమాల్లో కూడా బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ ప్రియులకు సైతం ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే పైకి ఎంత చలాకీగా కనిపించినా.. విష్ణు ప్రియ మనసులో చాలా విషాదాన్ని మోస్తుంది. ఈ మధ్యనే అంటే జనవరి నెల చివర్లో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. కొన్నాళ్లుగా ఆమె ఒంటరిగా జీవిస్తుంది.
అయితే ఇంతకాలానికి (Vishnu Priya) విష్ణుప్రియ తండ్రి ఈమెను చేరదీసినట్టు స్పష్టమవుతుంది. ఇటీవ ఫాదర్స్ డే నాడు ఓ టీవీ షోలో తన తండ్రితో పాటు హాజరైంది విష్ణుప్రియ. ఈ సందర్భంగా ఆమె కొంచెం ఎమోషనల్ అయ్యిందని చెప్పాలి . విష్ణుప్రియ మాట్లాడుతూ.. “నాకు 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే.. మా అమ్మా నాన్నలు విడిపోయారు. ఇటీవల మా అమ్మ చనిపోయారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూస్తున్నాను.
దాన్ని అది నా అదృష్టంగా భావిస్తున్నాను.అమ్మ నాన్నలు విడిపోయినందుకు నేను చాలా లైఫ్ మిస్ అయ్యాను అని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. అందుకే వాళ్లని తిట్టుకుంటూనే వచ్చాను. నాలా మీలో ఎవరైనా నా స్థానంలో ఉంటే.. దయచేసి ద్వేషించ వద్దు.. వాళ్లు ఎందుకు అలా చేశారో అర్థం చేసుకుని దగ్గరవ్వండి. ఏది జరిగినా అది మీ మంచి కోసమే అనుకోండి..!
తండ్రి ప్రేమను మిస్ అయ్యాను. నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు.. నాకు తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు.ఒక తల్లికి పుట్టకపోయినా మా నాన్న ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అది.ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్