శ్రీ విష్ణు ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. మిడ్ రేంజ్ హీరో అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ధియేటర్లకి ఫీడింగ్ అందేలా చేస్తున్నాడు. అతని గత చిత్రం ‘సింగిల్’ సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో అతని నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.
శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) ఫిబ్రవరి 27న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తి పెంచింది.యధునాథ్ మరుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మొదటి షోతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించింది.వీకెండ్ వరకు సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. కానీ నాలుగవ రోజు నుండి డౌన్ అయ్యింది..! తర్వాత ఎటువంటి గ్రోత్ చూపించడం లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 2.35 cr |
| సీడెడ్ | 0.55 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.16 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.06 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.54 cr |
| ఓవర్సీస్ | 1.02 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 5.62 cr (షేర్) |
‘విష్ణు విన్యాసం’ చిత్రానికి రూ.7 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమాకి రూ.5.62 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.10.61 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.