సినిమాల్లో కలిసి నటించిన చాలా జంటలు నిజజీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. కృష్ణ- విజయ నిర్మల నుండి విజయ్- రష్మిక వరకు ఎంతో మంది హీరో హీరోయిన్లు నిజజీవితంలో కూడా ప్రేమలో పడి పెళ్లి పీటలెక్కారు. ఈ లిస్టులో జీవిత- రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు. తమిళనాడుకి చెందిన జీవిత, రాజశేఖర్..లు కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కలిసి నటించారు.
తర్వాత వారు ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత కథ అందరికీ తెలిసిందే కదా..!అయితే ఈ జంట ఏ సినిమా టైంలో ప్రేమలో పడ్డారు అనేది చాలా మందికి తెలిసుండదు. ఆ సినిమానే ‘స్టేషన్ మాస్టర్'(Station Master).
అవును కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్..లు హీరోయిన్లుగా నటించారు. రాజశేఖర్ కి జోడీగా జీవిత నటించగా.. రాజేంద్రప్రసాద్ కి జోడీగా అశ్విని నటించారు. రావు గోపాల్ రావు ఈ చిత్రానికి ఓ నిర్మాత. ఆయనే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించారు అని చెప్పాలి. 1988 మార్చి 4న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 38 ఏళ్ళు పూర్తికావస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
రాజశేఖర్ మొదట్లో విలన్ గా చేసి ఆ తర్వాత ఇలాంటి కుటుంబ కథా సినిమాల్లో నటించారు. ఆ టైంలో ఆయనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. తర్వాత యాక్షన్ సినిమాలు చేశారు యాంగ్రీ స్టార్ ఇమేజ్ పొందారు. అయితే రాజశేఖర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమాల్లో ‘స్టేషన్ మాస్టర్’ ఒకటి. ఈ సినిమా టైంలోనే జీవిత- రాజశేఖర్..ల మధ్య ప్రేమ చిగురించింది.
తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.విజయ్- రష్మిక..లకి ‘గీత గోవిందం’ ఎంత స్పెషలో. రాజశేఖర్- జీవితాలకి ‘స్టేషన్ మాస్టర్’ అంత స్పెషల్ అన్నమాట.