నాని – విశ్వక్‌సేన్.. వీరిద్దరి మధ్య ఉన్న ‘హిట్’ బంధం ఒక్కటే. యంగ్ హీరోలు కాబట్టి స్నేహ బంధం కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఒకరిలా మరొకరు మాట్లాడుతుండటం చూస్తే ఆ బంధం బాగా ఎక్కువగానే ఉంది అనిపిస్తోంది. అదే తన సినిమా విషయంలో గుడ్డిగా మాట్లాడటం. ఎవరి ప్రోడక్ట్ మీద వారికి నమ్మకం ఉంటుంది. కానీ మరీ గుడ్డిగా వాదించేంత ఉండకూడదు కదా. ఇప్పుడు ‘ఫంకీ’ సినిమా గురించి విశ్వక్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. మీరు వింటే/ చదివితే మీకూ అలానే అనిపిస్తుంది.
సినిమా ఫలితం ఇచ్చిన ఎఫెక్టో, లేక ఎంత ప్రచారం చేసిన ఉపయోగం లేదనే నిరుత్సాహమో తెలియదు కానీ ‘ఫంకీ’ సినిమా గురించి ఇటు హీరో విశ్వక్‌సేన్, అటు నిర్మాత నాగవంశీ పూర్తిగా ప్రచారం ఆపేశారు. సినిమా రిలీజ్‌కి ముందు చేసిన ప్రచారం తప్ప.. రిలీజ్ అయ్యాక ఒక ప్రెస్ మీట్ పెట్టి ‘సాగరసంగమం’ కామెంట్ చేసేసి కామ్ అయిపోయారు. అయితే తమ సినిమా హిట్ అనే అంటున్నాడు విశ్వక్‌సేన్. తన కొత్త సినిమా ‘కల్ట్’ ప్రచారంలో భాగంగా బయటకు వచ్చిన విశ్వక్ ఈ కామెంట్స్ చేశాడు.
‘ఫంకీ’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వారం కూడా థియేటర్లలో లేకుండా పోయింది. వీకెండ్‌లో ఏదో కాస్త ఆడింది అంతే. అయితే ఎవరు ఏమనుకున్నా ‘ఫంకీ’ సినిమా తన వరకు హిట్టే అని చెప్పాడు విశ్వక్. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను గ్రేట్ సినిమా చేశాను అని క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో నాని కూడా ఇలానే మాట్లాడేవాడు. ‘వి’, ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల ఫలితాల విషయంలో నాని ఇలాంటి ఆన్సర్లే ఇచ్చిన విషయం తెలిసిందే.
వసూళ్లు లేవు కదా, టాక్ బాలేదు కదా అంటే ఎవరేమనుకున్నా నా సినిమా హిట్ అని వాదించేవాడు. ఇక విశ్వక్ కొత్త సినిమా ‘కల్ట్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను స్వీయం దర్సకత్వంలో నటిస్తున్నాడు. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ఈ సినిమా రూపొందింది. త్వరలో విడుదల చేస్తారు.