Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సెటైరికల్ కామెడీ డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబోలో వస్తున్న ‘ఫంకీ’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు పీక్స్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో నిర్మాత నాగవంశీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. సినిమాను థియేటర్ల వద్ద సేఫ్ జోన్‌లోకి తీసుకురావడానికి టికెట్ రేట్ల పెంపు అవసరమనేది ఆయన వెర్షన్.

Vishwak Sen

ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ తరహాలో టికెట్ ధరలను రూ.50 పెంచాలని నాగవంశీ సూచించారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో రేట్లు సమానంగా ఉంటాయని ఆయన వాదన. లాజిక్ పరంగా ఇది బాగానే ఉన్నా, గ్రౌండ్ లెవల్ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి సిటీలో మల్టీప్లెక్స్ కల్చర్, ఖర్చు చేసే కెపాసిటీ ఎక్కువ కాబట్టి అక్కడ రేట్ల పెంపును ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఏపీలోని చిన్న పట్టణాల్లో సీన్ అలా ఉండదు.

ఏపీలోని చాలా సెంటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్, రిపీటెడ్ ఆడియన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్. అక్కడ ఒక్కసారిగా టికెట్ రేట్లు పెంచితే సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనకాడతారు. సంక్రాంతి సినిమాల రేట్ల వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న టైమ్ లో, మళ్ళీ ఒక మీడియం రేంజ్ సినిమాకు రేట్లు పెంచడం రిస్క్ అని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రేట్లు తక్కువగా ఉంటేనే ఎక్కువ మంది జనం వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

నాగవంశీ మాత్రం ఈ విషయంలో తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా అనేది ఇప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని, మూడు గంటల వినోదానికి ఆ మాత్రం ఖర్చు చేయడం పెద్ద విషయం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ‘జాతిరత్నాలు’ రేంజ్ కామెడీని ఆశించి వచ్చే ఆడియన్స్‌కు టికెట్ రేటు భారంగా అనిపిస్తే అది సినిమా లాంగ్ రన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల రేట్లు పెంచక తప్పడం లేదని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ ఫన్ రైడ్ కోసం ప్రేక్షకులు నాగవంశీ అడిగినంత రేటు ఇచ్చి థియేటర్లకు వస్తారో లేదో చూడాలి. సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే రేట్లతో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus