Niharika: నిహారిక, వితికా షెరు బాలి ట్రిప్ ఫోటోలు వైరల్!

వరుణ్ సందేశ్ భార్య వితిక అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘ఝుమ్మంది నాదం’ వంటి సినిమాల్లో నటించింది. తన భర్త హీరోగా నటించిన సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. తన భర్తతో కలిసి ‘బిగ్ బాస్ 3’ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె బిగ్ బాస్ మూమెంట్స్ ఇప్పటికీ జనాలకు గుర్తున్నాయి. వరుణ్ – వితిక ల బంధాన్ని చూసి అంతా ఇంప్రెస్ అయ్యారు. ఇక హౌస్లో నుండి బయటకు వచ్చాక..

వితిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Niharika) తన భర్త వరుణ్ తో కలిసి ఈమె తన యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక మెగా వారి అమ్మాయి నిహారిక కొణిదెలతో కూడా ఈమెకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తాజాగా వీరిద్దరూ కలిసి బాలి ట్రిప్ వెళ్లారు. వీరితో పాటు ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి కూడా బాలి ట్రిప్ వెళ్ళింది. అక్కడ వీళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పటికప్పుడు వీరు అక్కడ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.

బీచ్ లో పరుగులు, రోడ్ల పై డాన్స్ లు, కార్లో ఇన్స్టాగ్రామ్ వీడియోలు.. ఇలా ఎందులోనూ వారు తగ్గలేదు. ఇక నిహారిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇక నిహారిక, వితిక ల బాలి ట్రిప్ కు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus