సినీ ఇండస్ట్రీలో నటుడిగా హీరోగా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వీకే నరేష్ ఒకరు. ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోగా నటించినటువంటి నరేష్ ప్రస్తుతం సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విధంగా యంగ్ హీరోలకు హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తున్న నరేష్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా 50 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. తాను ఇండస్ట్రీ లోకి రావడానికి కారణం తన అమ్మ విజయనిర్మల అని తెలిపారు. నేను ఉదయం లేవగానే అమ్మ మేకప్ రూమ్ చూసేవాడిని అలాగే అమ్మ కోసం ఎంతోమంది వచ్చేవారు అది చూసి నేను కూడా ఇదే రంగంలోకి రావాలని కోరుకున్నాను అంటు నరేష్ తెలిపారు. ఇక ప్రస్తుత కాలంలో ఒక నటుడు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టతరం అవుతుంది.
ఇక నేను 50 సంవత్సరాలు కొనసాగాను అంటే అది ప్రేక్షకుల అభిమానము పూర్వజన్మ సుకృతమే అంటూ (Naresh) నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిమానం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఈయన వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురవడంతో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటూ నరేష్ తెలిపారు.