రజనీ, కమల్ హాసన్ లతో బ్రతిమాలించుకొంటున్న వైజయంతిమాల!

  • July 23, 2018 / 08:18 AM IST

జనరల్ గా హీరోయిన్లు ఆఫర్ల కోసం తహతహలాడుతుంటారు. మరీ షెడ్యూస్ కుదరనంత బిజీగా ఉంటే తప్ప తమ దాకా వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ను వదిలిపెట్టరు. కానీ.. ఓ హీరోయిన్ మాత్రం సాక్ష్యాత్తూ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ హీరోలు ఇంటికి వచ్చి మరీ “మా సినిమాలో నటించండి” అని రిక్వెస్ట్ చేసినా కూడా సింపుల్ గా తప్పించుకొంటోంది సదరు స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరా నటీమణి? ఏకంగా రజనీకాంత్, కమల్ హాసన్ లను తన ఇంటి చుట్టూ తిప్పించుకోంటోంది అనుకొంటున్నారా.. గబుక్కున పేరు చెబితే గుర్తుపట్టకప్ప్వచ్చు కానీ.. ఆమె చరిత్ర తెలిస్తే అవాక్కవ్వకుండా ఉండలేరు. తెలుగు, తమిళ, మలయాళ, బెంగాళీ భాషల్లో నటించి దాదాపుగా నిన్నటితరం స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన వైజయంతిమాలను ఎరుగని సినిమా ప్రేక్షకుడు ఉండదు.

అలాంటి సీనియర్ మోస్ట్ నటీమణి 1965 తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయితే.. 1968 వరకూ ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆమెను ఎంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు అడిగినా సరే కుటుంబంతో కలిసి ఉండడానికి మొగ్గు చూపిందే తప్ప.. సినిమాల్లోకి మాత్రం రాలేదు. అయితే.. రీసెంట్ గా కమల్ హాసన్ ఏకంగా చెన్నైలో ఉన్న ఆమె స్వగృహానికి వెళ్ళి మరీ “ఇండియన్ 2″లో నటించమని కోరగా ఆమె ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. అంతే కాక రజనీకాంత్ కూడా అడిగాడు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని వైజయంతిమాల పేర్కొనడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus