War 2: వార్ 2: ఎన్టీఆర్ రోల్ వెనుక మరో పవర్ఫుల్ ఎలిమెంట్!

Ad not loaded.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  వార్ 2 (War 2) సినిమాపై రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan)  ప్రధాన పాత్రలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఓక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్, యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌లో తొలిసారి నటిస్తున్న ఎన్టీఆర్, ఇందులో ఏ రోల్ చేస్తున్నాడోననే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఎక్కువైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ పాత్రలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉండనుందట.

War 2

వార్ 2లో ఎన్టీఆర్ ఓ భారతీయ రా (RAW) ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ పాత్ర కాదు, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గా ఆయన కనిపించనున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ వచ్చింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. విరేంద్ర రఘునాథ్ అనే తెలుగు వ్యక్తి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్, మొదట దేశంపైన ఇష్టంతో ఉండి, అనివార్య పరిస్థితుల్లో రౌగ్ ఏజెంట్‌గా మారతాడట. అంటే, హృతిక్ రోషన్‌తో ఎదురు తలపడే ఓ పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడన్న మాట.

బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఇలా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు బలంగా ఉండడం మనం చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాంటి డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కథలో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీలో బలంగా ప్రచారం జరుగుతోంది. కథ మొత్తం ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఫేస్ ఆఫ్‌పై నడుస్తుందని, హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇదివరకు బాలీవుడ్ మూవీస్‌లో తెలుగు హీరోలు హీరో క్యారెక్టర్లతోనే కనిపించారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం యాక్షన్ డ్రివెన్ స్టోరీలో, విలన్ షేడ్స్ ఉన్న పాత్రతో కొత్త ఛాలెంజ్ తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కియారా అద్వానీ (Kiara Advani) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమె హృతిక్‌కి జోడీగా ఉంటుందా? లేక ఎన్టీఆర్ క్యారెక్టర్‌తో లింక్ ఉన్న పాత్రలో నటిస్తుందా? అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్, వార్ 2ని (War 2) పాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఈ సినిమా 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో విడుదల కానున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus