‘కొమరం పులి’ (Komaram Puli) సినిమా నిర్మాత సింగనమల రమేష్ బాబు (Singanamala Ramesh Babu). దాదాపు 14 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు వచ్చాక కూడా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల.. అతను సినిమాలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. ఆయనపై ఉన్న కేసు కోర్టు కొట్టేయడంతో ఈరోజు ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాను అని తెలిపారు.
ఇదే క్రమంలో ‘ ‘కొమరం పులి’ ‘ఖలేజా’ (Khaleja) సినిమాల వల్ల రూ.100 కోట్లు నష్టపోయాను. మహేష్ (Mahesh Babu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనీసం పట్టించుకుంది కానీ పలకరించింది కానీ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ‘ప్రజా రాజ్యం’ పార్టీ పనులకి వెళ్లిపోయారు. అందువల్ల బాగా లేట్ అయ్యింది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ (Bandla Ganesh Babu) తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..
“సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు.! మీ కోసం పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను..! దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి..! ఇది కరెక్ట్ కాదు.!” అంటూ పేర్కొన్నాడు.
వాస్తవానికి ‘కొమరం పులి’ సినిమాకి ఎక్కువ టైం అవ్వడం వల్ల… తర్వాతి సినిమాలని పవన్ కళ్యాణ్ రెట్టింపు స్పీడుతో కంప్లీట్ చేశారు. అందులో ‘తీన్ మార్’ (Teen Maar) ఒకటి. దానికి బండ్ల గణేష్ నిర్మాత. ఆ సినిమాని 6 నెలల వ్యవధిలోనే కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. అందువల్ల నిర్మాత బండ్ల గణేష్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత ‘పంజా’ (Panjaa) ని కూడా త్వరగానే కంప్లీట్ చేశారు.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025