కల్పిక ఓ తాగుబోతు, స్మోకింగ్ ఎక్కువ చేస్తుంది, గంజాయి కొట్టి ఏదేదో వాగుతూ ఉంటుంది: ధన్య బాలకృష్ణ

  • December 15, 2022 / 07:19 PM IST

తెలుగమ్మాయి కల్పిక గణేష్‌ అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయిన తమిళమ్మాయి ధన్య బాలకృష్ణన్‌ కూడా అందరికీ సుపరిచితమే. వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అది హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకు? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాల గురించి మాత్రమే కాకుండా నటీనటుల గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేస్తుంటుంది. తాజాగా ఆమె ధన్య బాలకృష్ణన్ కు తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ తో సీక్రెట్‌గా పెళ్లి జరిగినట్టు చెప్పి షాకిచ్చింది.

ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న బాలాజీ… ధన్యను రెండో పెళ్లి చేసుకున్నాడని, కానీ ఈ విషయాన్ని వాళ్లిద్దరూ బయట పెట్టలేదని ఆమె కల్పిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వీడియో కొన్ని గంటల్లోనే డిలీట్ అయిపోయింది. దీనికి కల్పిక స్పందిస్తూ.. ధన్య ఫోన్ చేసి బెదిరించి ఆ వీడియోని డిలీట్ చేయించినట్టు తెలిపింది. ‘నీ పవర్ చూపించి నీ గురించి నేను పెట్టిన వీడియోను యూట్యూబ్‌లో లేకుండా చేశావు . నా పవర్ కూడా చూపిస్తే… భస్మం అయిపోతారు.

నా పవన్ ఏంటో నీకు చూపిస్తా.. కోర్టులో కలుద్దాం’ అని కూడా అల్టిమేటం జారీ చేసింది కల్పిక. ఈ విషయం పై ధన్య కూడా తీవ్రంగా మండిపడినట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ‘కల్పిక పెద్ద తాగుబోతు. స్మోకింగ్ కూడా ఎక్కువగా చేస్తుంటుంది. గంజాయి కొట్టి ఏది పడితే అది వాగుతూ ఉంటుంది. ఎప్పుడూ.. మైకంలోనే ఉంటుంది. తెలుగమ్మాయి అనే ట్యాగ్ ను వాడుకుని పాపులర్ అయినట్టు ఫీలవుతుంది. ఆమె చేసిన కామెంట్లు..

చేసే కామెంట్లు ఆమెకే గుర్తుండవు. ఆమె చేసిన కామెంట్స్ నేను పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోకండి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి.’ అంటూ ధన్య బాలకృష్ణ తెలిపిందట. ఈ విషయం పై కోలీవుడ్లో కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించారు. కానీ వీరి మధ్య కాంబినేషనల్ సీన్స్ అయితే ఉండవు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus