Allu Aravind, Anil Sunkara: ఆ ఇద్దరు బడా నిర్మాతల మధ్య మళ్ళీ పోటీ..!

Advertisement

2020 వ సంవత్సరం సంక్రాంతికి ఏ రేంజ్ పోటీ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాల మధ్య నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ పోరు ఒకవైపు.. మరో వైపు నిర్మాతలు సంక్రాంతి మొగుడు ఆ మొగుడు.. ఈ మొగుడు అంటూ పోస్టర్లతో కొట్టుకోవడం వంటివి చూసాము. హోరాహోరీగా జరిగిన ఆ పోటీలో చివరికి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం పై చేయి సాధించింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు కూడా ఆ నిర్మాతల మధ్య మరోసారి అలాంటి పోటీ నెలకొనే విధంగా ఉంది. ఈసారి దసరా కానుకగా ఆ నిర్మాతల నుండీ వచ్చిన సినిమాలు పోటీపడబోతున్నాయి. కాకపోతే ఈసారి మీడియం రేంజ్ సినిమాలు. వివరాల్లోకి వెళితే.. ‘సరిలేరు’ నిర్మాత అనిల్ సుంకర ‘మహాసముద్రం’ అంటూ ఓ సినిమాని ఈరోజు థియేటర్లలోకి దింపాడు. అలాగే ‘అల వైకుంఠపురములో’ నిర్మాత అల్లు అరవింద్ గారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటూ ఓ సినిమాని రేపు థియేటర్లలో దింపుతున్నాడు.

‘అల’ కంటే ‘సరిలేరు’ ఒకరోజు ముందు విడుదలైంది. ఈసారి కూడా ‘మహాసముద్రం’ ఓ రోజు ముందు విడుదలైంది. ఈ మీడియం రేంజ్ సినిమాలకి కూడా పెద్ద సినిమాల మాదిరే ప్రమోషన్లు చేస్తున్నారు ఈ నిర్మాతలు. మరి ఈసారి వీరిద్దరిలో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus