స్నేహం చెడిందా.. అందుకే సినిమాలతో కొట్టుకుంటున్నారా?

స్నేహితులు విడిపోయి.. సినిమాలతో టీజర్లతో కొట్టుకోవడమేంటి? అసలు ఎవరు ఆ స్నేహితులు… ఏమిటి ఆ సినిమాలు… టీజర్లు… అసలు ఏంటి ఆ గొడవలు.. అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా..! గతంలో ’14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్’ బ్యానర్ పై ‘నమో వెంకటేశా’ ‘దూకుడు’ ‘1 నేనొక్కడినే’ ‘లెజెండ్’ ‘ఆగడు’ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ ‘హైపర్’ ‘లై’ వంటి సినిమాలు నిర్మించారు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర. అలా కలిసి సినిమాలు నిర్మిస్తూనే.. మరో పక్క అనిల్ సుంకర సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకుని ‘సీత’ ‘అందగాడు’ ‘రాజుగాడు’ వంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈసారి వారు మరింత దూరమయ్యారని తాజా సమాచారం. వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోయి ఇప్పుడు టీజర్లు, రిలీజ్ డేట్ లతో కొట్టుకుంటున్నారు.

అసలు మేటర్ కి వస్తే ’14 రీల్స్ ప్లస్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘వాల్మీకి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ ఆచంట, గోపి చంద్ అచంట. ‘వాల్మీకి’ టీజర్ ను ఈరోజే విడుదల చేసారు. ఇక మరో పక్క ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘చాణక్య’ సినిమా టీజర్ కూడా ఒక గంట గ్యాప్లో విడుదల చేశాడు. ఇక ‘వాల్మీకి’ చిత్రాన్ని సెప్టెంబర్ 20 న విడుదల చేస్తుండగా.. ‘చాణక్య’ సినిమాని కూడా దసరా టైంకే విడుదల చేస్తున్నట్టు టీజర్ చివర్లో చెప్పాడు. ఇక్కడ ‘వాల్మీకి’ చిత్రం మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 8 న విడుదల చేసే అవకాశం కూడా ఉందట. అంటే దసరా కి అన్న మాట. దీంతో ఈ నిర్మాతలు కావాలనే ఇలా తడబడుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus