‘6 టీన్స్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుతిక.. అటు తర్వాత ‘గర్ల్ ఫ్రెండ్’ ‘సరదా సరదాగా’ ‘విక్రమార్కుడు’ ‘ప్రేమాభిషేకం’ ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ ‘బ్లేడ్ బాబ్జి’ వంటి క్రేజీ మూవీస్ లో నటించింది. హీరోయిన్ గా ఎదగడానికి ఈమె ఎంతో హార్డ్ వర్క్ చేసింది. గ్లామర్ షో చేయడానికి, ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి కొంచెం కూడా వెనుకాడలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈమెకి అదృష్టం కలిసి రాలేదు.
ఇండస్ట్రీలో కొనసాగాలంటే కావాల్సిందే అది. కానీ రితికకి అది లేదు. రాజమౌళి కూడా ఈమెను నిలబెట్టలేకపోయాడు అంటే ఈమె టైం ఎంత బ్యాడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఈమె క్లిక్ అవ్వలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా ఈమె వెనుకాడలేదు. కెరీర్ ప్రారంభంలో ఈమె చేసిన బి గ్రేడ్ సినిమాలు ఈమె ఫామ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యాయి.
‘సారి నాకు పెళ్ళైంది’ ‘సారీ మా ఆయన ఇంట్లో’ ఉన్నాడు వంటి సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాల్సినవి కానీ లేట్ గా రిలీజ్ అయ్యాయి. దీంతో ఈమె కెరీర్ దెబ్బ తిని ఉండొచ్చు అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను… ఎంత చేసినా అదృష్టం కలిసిరాలేదు..
దాంతో సినిమాలకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను’ అంటూ ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. చివరిగా ఈమె అల్లరి నరేష్ నటించిన ‘కెవ్వు కేక’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె బెంగుళూరులోని తన సొంత నివాసంలో ఉంటుంది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!