కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్ తిరిగి మొదలైంది. వీలైనంత వేగంగా సినిమాల బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీంతో అందరికీ కనిపిస్తున్న డెస్టినేషన్ రామోజీ ఫిల్మ్ సిటీ. అన్ని రకాల సదుపాయాలు, ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, అన్నీ ఒకే దగ్గర దొరికే పరిస్థితి… ఇలా చాలా కారణాల వల్ల చిత్ర నిర్మాణ సంస్థలు ఆర్‌ఎఫ్‌సీకి ఓటేస్తున్నాయి. అయితే ఆ జాబితాలో రాజమౌళి మాత్రం లేరు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం ఆర్‌ఎఫ్‌సీకి వెళ్లేది లేదంటున్నారట. ఆయన ఎందుకలా చేస్తున్నారు… దీనికి ఓ సమాధానం వినిపిస్తోంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య గత సినిమాలను పరిశీలిస్తే… ఎక్కువ శాతం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సీ అధినేత రామోజీరావు అండ్ టీమ్‌తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి. మరోవైపు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల చిత్రీకరణలు సైతం చాలా వరకు అక్కడే జరిగాయి. ‘బాహుబలి’ సినిమాలో 80 నుండి 85 శాతం అక్కడే చిత్రీకరణ జరిగింది. దాని కోసం వేసిన ‘మాహిష్మతి’ సెట్ ఆర్‌ఎఫ్‌సీలో ఇంకా ఉంది. ఇక ఆ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తమ గత సినిమాల చిత్రీకరణలు అక్కడే చేశారు. ‘బాహుబలి’ తర్వాత ఈటీవీ కోసం సీరియల్ చేశారు.
పై మూడు విషయాలను పరిశీలిస్తే… ఇక్కడ పాయింట్‌గా కనిపిస్తోంది రాజమౌళి ఒక్కరే. ‘బాహుబలి’చిత్రీకరణ సమయంలో అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాతే రాజమౌళి, రామోజీరావు టీమ్ మధ్య చెడిందట. సినిమా కోసం ఆర్‌ఎఫ్‌సీ టీమ్ వేసి బిల్లే ఇందుకు కారణం అని అంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దర్శకత్వం మాత్రమే కాదు, అన్నీ చూసుకుంటారు అంటారు. ఆ క్రమంలో బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కవ మొత్తం సెట్స్, హాస్పిటాలిటీ కోసం ఆర్‌ఎఫ్‌సీకి ఇచ్చేయాల్సి వచ్చిందట. ఇది నచ్చని రాజమౌళి మళ్లీ ఆర్‌ఎఫ్‌సీ వచ్చేది లేదు అనుకున్నారట. అందుకే సినిమా కోసం ఇప్పటివరకు ఆర్ఎఫ్‌సకి వెళ్లలేదట. అయితే ఇవన్నీ తెలుస్తున్న సమాచారాలే… మరి వస్తున్న పుకార్లపై రాజమౌళి ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?