Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: వరుస విజయాలతో విర్రవీగి.. ఇప్పుడు కుదేలై!

Kangana Ranaut: వరుస విజయాలతో విర్రవీగి.. ఇప్పుడు కుదేలై!

  • May 24, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: వరుస విజయాలతో విర్రవీగి.. ఇప్పుడు కుదేలై!

పెరుగుట విరుగుట కొరకై అంటుంటారు పెద్దలు. అంటే ఎంత పెరిగితే అంత త్వరగా విరిగిపోతారు అని అర్థం. అయితే ఇది జాగ్రత్తగా ఒక్కో అడుగు వేసేవారికి వర్తించదు అనుకోండి. కంగన రనౌత్‌లా ఒక్క హిట్‌ పడగానే మొత్తం బాలీవుడ్‌కి నేనే క్వీన్‌, నేను చెప్పినట్లుగానే సినిమా పరిశ్రమ నడుచుకోవాలి అనుకునేవారికి ఈ సామెత బాగా వర్తిస్తుంది. వరుస విజయాలు వస్తున్నాయని విర్రవీగి, అందరి మీద నోరు పారేసుకుంది కంగన. ఇప్పుడు వరుస పరాజయాలతో కుదైలైపోయింది.

కంగన రనౌత్‌… బాలీవుడ్‌లో స్వయం శక్తితో ఎదిగిన కథానాయిక. తన సినిమాలు, తన పాత్రలు అంటూ చక్కగా కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ‘క్వీన్‌’ లాంటి హిట్‌ పడింది. ఆ సినిమా విజయంతో బాలీవుడ్‌లో చాలామంది కళ్లు ఆమె మీద పడ్డాయి. కానీ ఆమె కళ్లు గతంలో ఆమెను ఇబ్బంది పెట్టిన, ఇబ్బందిపెట్టడానికి ట్రై చేసిన (?) వారి మీద పడ్డాయి. వరుస విమర్శలతో వారికి నిద్ర లేకుండా చేసింది. మరోవైపు ఆమె సోదరి రంగోళీ కూడా ఇదే పని చేసింది.

దీంతో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అనే పేరు సంపాదించుకుంది కంగన. అదే సమయంలో వరుసగా విజయాలు వచ్చాయి. తన విజయానికి రహస్యం, తన అగ్రెసివ్‌నెస్‌ అని అనుకుంది కంగన అంటుంటారు బాలీవుడ్‌ విమర్శకులు. ‘క్వీన్’ తర్వాత ‘త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్’, ‘మణికర్ణిక’, ‘పంగా’ అంటూ విజయాలు అందుకుంది. దీంతో ఆమె తనకు తాను సూపర్‌స్టార్‌, బాలీవుడ్‌ సేవియర్ అనుకుంది. తనకు సంబంధం లేని లీగల్‌ విషయాల్లో తలదూర్చి రచ్చ రచ్చ చేసింది.

సుశాంత్‌ సింగ్‌ రాజపూత్‌ విషయంలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది. హృతిక్‌ రోషన్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెపోటిజం అంటూ ప్రేక్షకులకు లేని బాధను భుజాన వేసుకొని గోల గోల చేసింది. క్రిష్ లాంటి పేరున్న ద‌ర్శ‌కుడిని ప‌క్క‌న పెట్టి.. ‘మ‌ణిక‌ర్ణిక‌’కు రీషూట్లు చేయ‌డం, ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వ‌కుండా త‌క్కువ చేసి మాట్లాడ‌టం లాంటివి చేసింది. అత‌ణ్ని అవ‌మానించేలా స్టేట్మెంట్లు ఇవ్వ‌డం గుర్తుండే ఉంటుంది.

దీంతో కంగన ఊరికనే నోరు పారేసుకుంటుంది అనే పేరు బాగా తెచ్చుకుంది. అయితే కంగన జోరు ఇటీవల తగ్గింది. కారణం విజయాలు లేకపోవడమే అంటారు. అయితే గత రెండు సినిమాలుగా కంగన పరిస్థితేం బాలేదు. మినిమమ్‌ వసూళ్లు కూడా రావడం లేదు. నార్త్‌లో ‘క్వీన్‌’ అయిపోయిన కంగన.. సౌత్‌లో ‘తలైవి’ అయిపోదాం అనుకుని సినిమా చేస్తే అది తుస్‌ మంది. ఇప్పుడు ‘థాకడ్‌’ పరిస్థితి ఇంకా దారుణం. ఈ సినిమా ఫలితం గురించి అడిగితే కంగనకు చాలా కోపం వచ్చేలా ఉంది.

వీకెండ్‌లో ఈ సినిమాకు రూ.3 కోట్లు వ‌సూళ్లూ కూడా రాలేదని చెబుతున్నారు బాలీవుడ్‌ పరిశీలకులు. ఫుల్ ర‌న్ క‌లెక్ష‌న్లు రూ.4 కోట్లు దాటేలా కూడా లేవట. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్లు అని అంటున్నారు. అంత బ‌డ్జెట్లో తీసిన సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.4 కోట్లు కూడా రాలేదంటే ఏ స్థాయి దారుణమైన ఫలితమో అర్థం చేసుకోవ‌చ్చు. ఆమెపై నెగెటివిటీ బాగా పెరిగిపోవడం, కథల విషయంలో ఆమె అతి విశ్వాసమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. అందరికీ చెప్పే కంగన ఎప్పటికి మేలుకుంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version