పెరుగుట విరుగుట కొరకై అంటుంటారు పెద్దలు. అంటే ఎంత పెరిగితే అంత త్వరగా విరిగిపోతారు అని అర్థం. అయితే ఇది జాగ్రత్తగా ఒక్కో అడుగు వేసేవారికి వర్తించదు అనుకోండి. కంగన రనౌత్‌లా ఒక్క హిట్ పడగానే మొత్తం బాలీవుడ్‌కి నేనే క్వీన్, నేను చెప్పినట్లుగానే సినిమా పరిశ్రమ నడుచుకోవాలి అనుకునేవారికి ఈ సామెత బాగా వర్తిస్తుంది. వరుస విజయాలు వస్తున్నాయని విర్రవీగి, అందరి మీద నోరు పారేసుకుంది కంగన. ఇప్పుడు వరుస పరాజయాలతో కుదైలైపోయింది.
కంగన రనౌత్… బాలీవుడ్‌లో స్వయం శక్తితో ఎదిగిన కథానాయిక. తన సినిమాలు, తన పాత్రలు అంటూ చక్కగా కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ‘క్వీన్’ లాంటి హిట్ పడింది. ఆ సినిమా విజయంతో బాలీవుడ్‌లో చాలామంది కళ్లు ఆమె మీద పడ్డాయి. కానీ ఆమె కళ్లు గతంలో ఆమెను ఇబ్బంది పెట్టిన, ఇబ్బందిపెట్టడానికి ట్రై చేసిన (?) వారి మీద పడ్డాయి. వరుస విమర్శలతో వారికి నిద్ర లేకుండా చేసింది. మరోవైపు ఆమె సోదరి రంగోళీ కూడా ఇదే పని చేసింది.
దీంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనే పేరు సంపాదించుకుంది కంగన. అదే సమయంలో వరుసగా విజయాలు వచ్చాయి. తన విజయానికి రహస్యం, తన అగ్రెసివ్‌నెస్ అని అనుకుంది కంగన అంటుంటారు బాలీవుడ్ విమర్శకులు. ‘క్వీన్’ తర్వాత ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘మణికర్ణిక’, ‘పంగా’ అంటూ విజయాలు అందుకుంది. దీంతో ఆమె తనకు తాను సూపర్‌స్టార్, బాలీవుడ్ సేవియర్ అనుకుంది. తనకు సంబంధం లేని లీగల్ విషయాల్లో తలదూర్చి రచ్చ రచ్చ చేసింది.
సుశాంత్ సింగ్ రాజపూత్ విషయంలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది. హృతిక్ రోషన్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెపోటిజం అంటూ ప్రేక్షకులకు లేని బాధను భుజాన వేసుకొని గోల గోల చేసింది. క్రిష్ లాంటి పేరున్న దర్శకుడిని పక్కన పెట్టి.. ‘మణికర్ణిక’కు రీషూట్లు చేయడం, దర్శకుడిగా అతడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేసింది. అతణ్ని అవమానించేలా స్టేట్మెంట్లు ఇవ్వడం గుర్తుండే ఉంటుంది.
దీంతో కంగన ఊరికనే నోరు పారేసుకుంటుంది అనే పేరు బాగా తెచ్చుకుంది. అయితే కంగన జోరు ఇటీవల తగ్గింది. కారణం విజయాలు లేకపోవడమే అంటారు. అయితే గత రెండు సినిమాలుగా కంగన పరిస్థితేం బాలేదు. మినిమమ్ వసూళ్లు కూడా రావడం లేదు. నార్త్‌లో ‘క్వీన్’ అయిపోయిన కంగన.. సౌత్‌లో ‘తలైవి’ అయిపోదాం అనుకుని సినిమా చేస్తే అది తుస్ మంది. ఇప్పుడు ‘థాకడ్’ పరిస్థితి ఇంకా దారుణం. ఈ సినిమా ఫలితం గురించి అడిగితే కంగనకు చాలా కోపం వచ్చేలా ఉంది.
వీకెండ్‌లో ఈ సినిమాకు రూ.3 కోట్లు వసూళ్లూ కూడా రాలేదని చెబుతున్నారు బాలీవుడ్ పరిశీలకులు. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.4 కోట్లు దాటేలా కూడా లేవట. ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు అని అంటున్నారు. అంత బడ్జెట్లో తీసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.4 కోట్లు కూడా రాలేదంటే ఏ స్థాయి దారుణమైన ఫలితమో అర్థం చేసుకోవచ్చు. ఆమెపై నెగెటివిటీ బాగా పెరిగిపోవడం, కథల విషయంలో ఆమె అతి విశ్వాసమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. అందరికీ చెప్పే కంగన ఎప్పటికి మేలుకుంటుందో చూడాలి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!