“శక్తి” లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ తర్వాత కూడా వెంకటేష్ ఇచ్చిన అవకాశాన్ని “షాడో”తో గంగపాలు చేసుకొన్న మెహర్ రమేష్ “షాడో” తర్వాత మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. నిజానికి మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషైన మెహర్ ఈమధ్యకాలంలో ఎక్కువగా మహేష్ బాబుతో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు అటెండ్ అయ్యే పబ్లిక్ ఈవెంట్స్ తోపాటు ప్రయివేట్ ఫంక్షన్స్ లో కూడా మహేష్ & ఫ్యామిలీతో మెహర్ కనిపిస్తూనే ఉంటాడు. ఇదివరకు కూడా ఈ విషయమై చాలా చర్చలు జరిగినప్పటికీ.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
అయితే.. ఇటీవల ఏ.ఏం.బి సినిమాస్ లాంచ్ ఈవెంట్ లో మెహర్ చాలా యాక్టివ్ గా ఉండడమే కాక చాలా రెగ్యులర్ గా ఆ మల్టీప్లెక్స్ లో కనిపిస్తుండడంతో.. మహేష్ తన మల్టీప్లెక్స్ బాధ్యతలు మెహర్ కి అప్పగించాడా ఏమిటా అని ఆలోచనలో పడ్డారు మహేష్ బాబు అభిమానులతోపాటు ఇండస్ట్రీ వర్గాలు. ఈ ఏ.ఏం.బీ సినిమాస్ ను డెవలప్ చేసే ఆలోచనలో కూడా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి ఇక మెహర్ ఎప్పటికీ మహేష్ దగ్గర ఫిక్స్ అని అర్ధమవుతోంది.