పరాయి దేశంలో పూనమ్ కౌర్ కి భీభత్సమైన పాపులారిటీ!

  • December 17, 2018 / 07:16 AM IST

తెలుగు రాష్ట్రాల్లో తనను కథానాయికగా కాదు కదా కనీసం హాట్ బ్యూటీగా కూడా ఎవరూ గుర్తించకపోవడంతో సినిమాల నుంచి సైడ్ అయిపోయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చేనేతకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడూ చిన్న చిన్న సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే.. పూనమ్ అనుకోకుండా పాకిస్తాన్ లో బాగా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ న్యూస్ పేపర్స్ మరియు చానల్స్ లో పూనమ్ హాట్ టాపిక్ మాత్రమే కాదు.. ట్రెండింగ్ కూడా.

ఎందుకలా జరిగిందంటే.. ఇటీవల పాకిస్తాన్ లోని ఓ గురుద్వార్ ను సందర్శించిన పూనమ్.. ఇప్పటివరకు తాను విజిట్ చేసిన అన్నీ గురుద్వార్స్ మీద కలిపి ఒక షార్ట్ ఫిలిమ్ చేసింది. సిక్కులందరూ ఈ షార్ట్ ఫిలిమ్ కు ఫిదా అయిపోయారు. దాంతో ఇప్పుడు సిక్కులతోపాటు.. పాకిస్తాన్ లోనూ పూనమ్ కి మంచి పాపులారిటీ వచ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అక్కడ ఆమెను తెలుగు నటిగా కాక తమిళ నటిగా గుర్తించడం. బేసిగ్గా తెలుగమ్మాయి అయిన పూనమ్ ను అక్కడి మీడియా తమిళ నటి అని పేర్కొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus