‘కమల్ హాసన్ – రజనీకాంత్’ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుథ్‌ని కమల్, రజనీ ఓ మాట అడుగుతారు గుర్తుందా? ‘ఎవరు హీరో’ అని. ఇప్పుడు అదే ప్రశ్నను ఫ్యాన్స్, ప్రేక్షకులు నెల్సన్ దిలీప్ కుమార్‌ని అడుగుతున్నారు. ఎందుకంటే ‘జైలర్ 2’ సినిమా తర్వాత ఆయన సినిమా ఏంటో ఇంకా తేలలేదు. నిజానికి ఇప్పటికే ఓ సినిమా అనౌన్స్ అయినా.. అది ఇప్పుడు సెట్స్‌పైకి రాదు అని చెబుతున్నారు. అదే కమల్ – రజన కాంబో.
దీంతో ఆ సినిమా కంటే ముందు నెల్సన్ ఏ సినిమా చేస్తారు అనే విషయంలోనే చర్చ నడుస్తోంది. మొన్నీమధ్య వరకు అంటే ‘జైలర్ 2’ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు ఈ సినిమాలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ‘జైలర్ 2’ సినిమాలో హృతిక్ రోషన్‌ను నెల్సా చూపించిన విధానం చూశాక ఆయనతో ఓ సినిమా ఉంటుంది అనే చర్చ మొదలైంది. కొన్నేళ్ల క్రితం హోంబలే ఫిల్మ్స్ నెల్సన్‌ను ఓ అడ్వాన్స్ ఇచ్చింది. దాంతోనే ఇప్పుడు సినిమా చేస్తారని అదే హృతిక్ రోషన్‌తో అని ఓ చర్చ మొదలైంది.
మరోవైపు హోంబలే తరహాలోనే నిర్మాత నాగవంశీ కూడా నెల్సన్‌కి అడ్వాన్స్ ఇచ్చేసి ఉన్నారు. ‘జైలర్ 2’ సినిమాను కూడా ఆయన కోసమే రిలీజ్ చేశారు. కాబట్టి నాగవంశీకే నెల్సన్ సినిమా చేస్తారని టాక్. ఆ సినిమా హీరో ఎన్టీఆర్ అని, ఆ సినిమా పేరు ‘రాక్’ అని మరో చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది. ఇక సూర్యతో కూడా నెల్సా సినిమా ఉంటుందని, అది సూర్య 50వ సినిమా అని కూడా అంటున్నారు. దీంతో ‘ఎవరు హీరో’ అనే చర్చ అయితే నడుస్తోంది.
ఈ విషయంలో నెల్సన్ దిలీప్ కుమార్ ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అనేది చూడాలి. ఆయనకు లేదంటే ఆయన ప్రతి సినిమాకు సంగీతం అందించే అనిరుథ్‌కి అయినా తెలియాలి. ఇప్పుడు ఆయన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు అనుకోండి. తెలుసుగా కావ్యా మారన్‌తో అనిరుథ్ పెళ్లి.