ప్రభాస్ అభిమానుల అసహనం పీక్స్ కి చేరింది. వారు ఎప్పటి నుండో సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ పై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. నెగెటివ్ యాష్ టాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత ఆగ్రహంలో ఉన్న నేపథ్యంలో జూన్ నెలలో ప్రభాస్ మూవీ నుండి అప్డేట్ ఉంటుందని ప్రచారం జరిగింది. ఈనెలలో ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానుందని వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర దర్శక నిర్మాతల నుండి ఎటువంటి సమాచారం లేకపోయినా ఫ్యాన్స్ అయితే గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఐతే దీనిపై అప్డేట్ వస్తుందన్న ఎటువంటి సూచనలు కనిపించడం లేదు. టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి రాని యూనిట్ అప్పుడే ప్రకటించకూడదు అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ చిత్రానికి జాను వర్కింగ్ టైటిల్ గా ఉంది. ఆ టైటిల్ ని దిల్ రాజు తను నిర్మించిన 96 తెలుగు రిమేక్ కోసం వాడుకున్నారు. అలాగే ఓ డియర్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉండగా ఇంకా ఏది నిర్ణయించలేదని సమాచారం. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్న అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.
దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 1960లలో జరిగిన యూరప్ నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగుతుందట. పాన్ ఇండియా చిత్రంగా దాదాపు 150కోట్లకు పైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.