Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

పరాభవ నామ సంవత్సరం చాలామంది తెలుగు హీరోలకు, హీరోయిన్లకు విజయాలు ఇచ్చి పరాభవాల నుండి బయటపడేసింది అంటూ ఓ లిస్ట్‌ చెప్పుకున్నాం. ఆ లిస్ట్‌లో రామ్‌చరణ్‌ (పెద్ది), సమంత (మా ఇంటి బంగారం), అఖిల్‌ అక్కినేని (లెనిన్‌), వరుణ్‌ తేజ్‌ (కొరియన్‌ కనకరాజు) లాంటి పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి రావడానికి మరికొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లెవరు, ఆ సినిమాల సంగతేంటో చూద్దాం.

Tollywood

హిట్‌ కొట్టాల్సిన హీరోల లిస్ట్‌ చూస్తే.. నితిన్‌ గురించి మాట్లాడుకోవాలి. గత కొన్ని ఏళ్లుగా పరాజయాలే తప్ప విజయాలు చూడని ఆయన.. ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రెండికి రెండూ కొత్త రకం కాన్సెప్ట్‌లే. అందులో ఒకటి నాని నిర్మిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ ఒకటి. ఇక ఎనిమిదేళ్ల క్రితం విజయం సాధించిన విజయ్ దేవరకొండ కూడా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు విజయ్‌ చేతిలో ‘రణబాలి’, ‘రౌడీ జనార్థన’ ఉన్నాయి. మరి వీటిలో ఏది పరాభవ నామ సంవత్సరంలో వస్తుందో చూడాలి.

నాలుగేళ్ల క్రితం విజయం అందుకున్న గోపీచంద్‌.. ఇప్పుడు ‘భరతవర్ష’ అనే సినిమాను సంకల్ప్‌ రెడ్డితో చేస్తున్నారు. కొత్త దర్శకుడితో మరో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఈ రెండూ విజయకాంక్షను తీరుస్తాయేమో చూడాలి. ‘దాస్‌ కా ధమ్కీ’ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్‌సేన్‌ ఆ తర్వాత మరో విజయం అందుకోలేకపోయాడు. ఇప్పుడు విజయం కోసం సరైన సినిమాను చేసే పనిలో ఉన్నాడు. ‘టిల్లు’ గా తప్ప.. ఇంకే వేషం వేసినా విజయం అందుకోలేకపోతున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా హిట్‌ కోసం చూస్తున్నాడు.

వీరు మాత్రమే కాదు నాగశౌర్య, వైష్ణవ్‌ తేజ్‌, కార్తికేయ గుమ్మకొండ, సుధీర్‌బాబు, నిఖిల్‌, రామ్‌ పోతినేని, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు. అయితే వచ్చే కొత్త ఉగాది నాటికి వీరిలో ఎంతమంది సినిమాలు తెస్తారు.. పరాభవం దాటి వస్తారో చూడాలి.

2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus