ఈ పంజాబీ బ్యూటీ ఎవర్ని తిడుతోందబ్బా!

సినిమాల్లో ఆఫర్లు లేకపోయినా పాలిటిక్స్ అనీ, స్పెషల్ ఇంటర్వ్యూస్ అనీ ఏదో ఒక విధంగా లైమ్ లైట్ లో సర్వైవ్ అవుతున్న చాలా మంది కథానాయికల్లో టాప్ 5 లిస్ట్ లో ఉండే అమ్మాయి పూనమ్ కౌర్. ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చిన “మాయాజాలం” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన పూనమ్ కౌర్ ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేక సెకండ్ హీరోయిన్ రోల్స్, సిస్టర్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను నెట్టుకొచ్చింది. కానీ.. ఇప్పుడు ఆఫర్లు అసలే రాకపోవడంతో సినిమాలకు ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసి ఏవేవో కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.

అయితే.. ఈమధ్యకాలంలో అమ్మడు ఎవరిని తిడుతుందో తెలియకుండా ట్విట్టర్ లో దాడి మొదలెట్టింది. పవన్ కళ్యాణ్ ను తిడుతుందని కొందరు అంటుంటే.. ఇంకొందరేమో త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తుంది అంటున్నారు. మరి అమ్మడు ఎవర్ని తిడుతుందో తెలియదు కానీ.. గట్టిగానే ఆడిపోసుకుంటుంది. సొ, పూనమ్ పాప ఈ ఇండైరెక్ట్ ఎటాక్ వదిలి డైరెక్ట్ గా ఎటాక్ చేస్తేనే ఎవరైనా ఆమెను పట్టించుకొంటారు. లేదంటే హడావుడి చేస్తుందని ఎవరూ పట్టించుకోకుండా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus