‘రియా ఎవరు?’.. ఇలా కూడా ట్రెండింగ్‌లోకి రావొచ్చా?

  • October 20, 2024 / 12:33 PM IST

సినిమా ప్రచారానికి ఒక్క డైలాగ్‌, ఒక్క చిన్న వీడియో చాలు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఒకవేళ లేదు అంటే లేటెస్ట్‌ వైరల్‌ క్లిప్‌ దాని వెనుక కథ గురించి తెలుసుకోవాల్సిందే. ఆ క్లిప్‌ పేరు ‘రియా ఎవరు?’ అయితే.. ఆ సినిమా పేరు ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)   . సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవారు అయితే ఈ మొత్తం కథేంటి అనేది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. శ్రీ సింహా కోడూరి (Sri Simha) , ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) , సత్య (Satya)  ప్రధాన పాత్రధారులుగా నితీశ్‌ రాణా (Ritesh Rana) ఓ సినిమా తెరకెక్కించారు.

Riya

అదే ‘మత్తు వదలరా 2’. ఈ సినిమా థియేటర్లలో ఇప్పటికే మంచి విజయం అందుకోగా. ఓటీటీలోకి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా వచ్చి అక్కడా భారీ విజయాన్నే అందుకుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా లోని ఓ సీన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే ‘రియా (Riya) ఎవరు?’ అని. సినిమాలో సత్య ఈ మాట అడుగుతాడు. మామూలుగా అయితే ఇది మామూలు ప్రశ్న. దానికి అజయ్‌ ఇచ్చింది మామూలు ఆన్సర్‌.

కానీ దర్శకుడు నితీశ్‌ రాణా ఆ సీన్‌ను భలేగా రాశారు. దానిని సత్య అండ్‌ కో బాగా పండించారు కూడా. థియేటర్లలో సినిమా వచ్చినప్పుడు నవ్వుకున్న ఆ సీన్‌.. ఓటీటీలోకి వచ్చాక వైరల్‌ స్టఫ్‌ అయింది. ఇప్పుడు ఈ వీడియోను రీల్స్‌గా సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. దీంతో సినిమా ఓటీటీ వెర్షన్‌కు భలే ప్రచారం కూడా లభిస్తోంది.

ఇంత చదివాక ఆ రియా ఎవరో కూడా తెలియాలి కదా.. ఆ సినిమాలో రియా (Riya) పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఇషా యాదవ్. ముంబయి బ్యూటీగా ఆమెకు యూట్యూబ్‌ ఫిలిమ్స్, షార్ట్స్ ద్వారా మంచి గుర్తింపే ఉంది. తెలుగులో ‘సిద్ధు బీకామ్‌’ అనే యూట్యూబ్‌ సిరీస్‌ కూడా చేసింది. అదే ఫ్లోలో ‘మత్తు వదలరా 2’లో నటించి మెప్పించి, ఇప్పుడు వైరల్‌ అయింది.

23 ఏళ్ళ ‘మనసంతా నువ్వే’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus