Manasantha Nuvve Collections: 23 ఏళ్ళ ‘మనసంతా నువ్వే’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran) కెరీర్లో ఆల్ టైం హిట్ సినిమాల్లో ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) ఒకటి. రీమాసేన్ (Reema Sen) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) దర్శకుడు. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై యం.యస్.రాజు (M. S. Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001 అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా నేటితో 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ‘#23YearsForManasanthaNuvve’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

Manasantha Nuvve Collections:

ఈ క్రమంలో ‘మనసంతా నువ్వే’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.42 cr
సీడెడ్ 3.10 cr
ఉత్తరాంధ్ర 1.58 cr
ఈస్ట్ 1.21 cr
వెస్ట్ 1.08 cr
గుంటూరు 1.38 cr
కృష్ణా 1.44 cr
నెల్లూరు 0.88 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
1.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.31 cr (షేర్)

‘మనసంతా నువ్వే’ రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ఫుల్ రన్లో రూ.18.31 కోట్ల షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకటేష్ (Venkatesh Daggubati) ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) తో నష్టపోయిన బయ్యర్స్ ని.. ‘మనసంతా నువ్వే’ తో ఆదుకున్నాడు నిర్మాత యం.యస్.రాజు. అలాగే హీరో ఉదయ్ కిరణ్ ఈ చిత్రంతో ‘హ్యాట్రిక్ కొట్టాడు.

‘వేట్టయన్‌’ ఎఫెక్ట్‌.. తారక్‌ సినిమా పేరు కూడా మారుతోందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus