Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చిన తర్వాత.. దాని వినియోగం సినిమాల్లో బాగా పెరిగిన తర్వాత.. ఇప్పుడు డూప్‌ల గోల పక్కకు వెళ్లిపోయి.. ఏఐ పాత్రల గోల పెరిగిపోయింది. మనకు పెద్దగా పరిచయం లేని నటులు పోషించే పాత్రలను చూసి ‘నిజమేనా? ఏఐతో చేశారా?’ అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ‘ఫౌజీ’ (Fauzi) సినిమా నుండి వచ్చిన ‘హ్యాపీ రెబల్స్‌ డే’ అంటూ వచ్చిన గ్లింప్స్‌ వీడియో చూసి కూడా చాలామంది ఇదే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు.

Fauzi Movie

‘ఫౌజీ’ సినిమాలోని ప్రభాస్ పాత్రను పరిచయం చేసే పనిని.. సుభాష్‌ చంద్రబోస్‌కి అప్పగించారు. ఫైల్ నంబర్ 25 అంటూ విడుదల చేసిన ఈ రెండున్నర నిమిషాల గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు భారీ ఎలివేషన్లు ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ నోటి ద్వారా ఆ డైలాగ్‌లు చెప్పించడం వావ్‌ అని చెప్పాలి. ప్రభాస్‌ పాత్ర కనిపించేది ఈ వీడియో కాసేపే కావడం.. నేతాజీ పాత్ర ఎక్కువ సేపు ఉండటమో ఏమో ఆయన పాత్రకు మంచి ఎలివేషనే వచ్చింది.

ఆ వీడియోలో హిట్లర్, సుభాష్ చంద్రబోస్ విజువల్స్ సహజంగా, నిజమైన నాయకుల్లా కనిపించడంతో చాలామంది ఈ వీడియోలని పాత్రలు ఏఐ సాయంతో చేసినవి అనుకున్నారు. అయితే అవి ఏఐ విజువల్స్ కావుజ నిజమైన నటులే ఈ పాత్రల్లో జీవించారు అంటే అతిశయోక్తి కాదు. సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించిన వ్యక్తి అచ్చుగుద్దినట్లు సరిపోయారు. ఆయనే మరాఠి నటుడు సుభోద్ బావే.

మరాఠీ చిత్ర పరిశ్రమలో సుభోద్ బావే గొప్ప నటుడు. ఆయన రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. నాటకాల నుండి సినిమాల వరకు వచ్చారాయన. 1990ల కాలంలో నాటక రంగంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు సుభోద్. 2002 నుంచి మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు. కొంకణీ, మలయాళ భాషల్లోనూ నటించారు. 2015లో వచ్చిన ‘లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్’ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర తిలక్ పాత్రలో నటించి మెప్పించారు.

 రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus